భరోసా అవగాహన కార్యక్రమం!
GDWL: జిల్లా ఎస్పీ టీ.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు భరోసా సిబ్బంది పలు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్లబీడులోని కేజీబీవీ పాఠశాల, కొండాపూర్‌లోని మండల పరిషత్ హైస్కూల్‌లో విద్యార్థినిల భద్రత, మహిళా రక్షణ, డిజిటల్ చైతన్యం వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు.