'వార్డు అభివృద్ధికి అందరూ సహకరించాలి'
MNCL: వార్డు అభివృద్ధికి అందరూ సహకరించాలని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు సభ్యులు రాజు కోరారు. ఆదివారం 7వ వార్డులోని ఆంధ్ర కాలనీ పాల కేంద్రం సమీపంలో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన పరిశీలించారు. తాను కౌన్సిలర్‌గా ఎన్నికైన తర్వాత వార్డులోని అన్ని కాలనీలలో డ్రైనేజీలు, సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు.