పాత కక్షల నేపథ్యంలో దాడి.. కేసు నమోదు

పాత కక్షల నేపథ్యంలో దాడి.. కేసు నమోదు

W.G: పాత గొడవల నేపథ్యంలో ఒక వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకివీడు మండలం దుంపగడప గ్రామ శివారు పల్లెపాలెంకు చెందిన బొడ్డు గణేశ్‌ను అదే గ్రామానికి చెందిన కొల్లాటి మణికంఠ కొట్టి గాయపరిచాడు. ఈ ఘటనపై బొడ్డు గణేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కొల్లాటి మణికంఠపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు.