VIDEO: 'మొక్కలు పెడతారు.. పెరిగాక నరికేస్తారు'
JGL: ప్రతి ఏటా మొక్కలు పెడతారు.. పెరిగాక నరికేస్తారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో హరితహారంలో మొక్కలు నాటారు. గత కొన్నేళ్లుగా మున్సిపల్ సిబ్బంది నీళ్లు పోస్తూ మొక్కలను సంరక్షించారు. అయితే విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్నాయని రాయికల్ విద్యుత్ శాఖ అధికారులు చెట్లను నరికి వేస్తున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.