ప్రపంచకప్ విజేతకు చారిత్రక గౌరవం
మహిళ వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్ జట్టు టీమిండియాలో కీలక సభ్యురాలైన రిచా ఘోష్‌కు చారిత్రక గౌరవం దక్కింది. రిచా పేరిట ఆమె సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు బెంగాల్ సీఎం మమతా స్వయంగా ప్రకటించారు. రిచా స్వగ్రామం సిలిగురికి క్రికెట్ మైదానాన్ని కేటాయిస్తూ.. దానికి రిచా పేరు నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు.