సికింద్రాబాద్‌లో డబుల్ టెన్నిస్ టోర్నమెంట్ షురూ..!
HYD: సికింద్రాబాద్‌లో డబుల్ టెన్నిస్ టోర్నమెంట్ షురూ అయింది. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. రైల్వే డిపార్ట్‌మెంట్ వారికి ఇలాంటి అవకాశాలు రావడం మానసికంగా, శారీరకంగా బలం చేకూరుస్తాయని DRM గోపాలకృష్ణన్ తెలిపారు. అందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.