ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
GNTR: తుళ్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారీయా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వైద్యులకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ఫార్మసీలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా ఎంత మేర వ్యాధి గ్రస్తులకు ఇస్తున్నారనే విషయాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న రోగులతో మాట్లాడిన అనంతరం అధికారులకు పలు సూచనలిచ్చారు.