సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకండి: ఎస్సై

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకండి: ఎస్సై

MHBD: వాట్సప్ గ్రూపుల్లో రూ.5000 వస్తాయని వస్తున్న మెసేజ్‌లు నమ్మవద్దని తొర్రూరు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని, ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులను ఓపెన్ చేయకుండా, ఇతరులకు పంపకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.