'కొత్త రేషన్ కార్డుల నమోదును సద్వినియొగం చేసుకోండి'

KRNL: రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం అవకాశం కల్పిస్తోందని కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి గురువారం తెలిపారు. గ్రామ సచివాలయాలలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్త కార్డులు జారీ, రేషన్ కార్డులు స్ప్లిట్, కొత్త సభ్యుల చేరిక, చిరునామా మార్పులు చేసుకోవచ్చన్నారు.