కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

VZM: వంగర మండలం మగ్గూరు-సంగాం రోడ్డులో మగ్గూరు వద్ద బుధవారం సాయంత్రం ట్రాక్టర్‌ అదుపుతప్పి మడ్డువలస రిజర్వాయర్‌ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. స్దానికుల వివరాల ప్రకారం వరి పంటను తరలించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. అనంతరం స్థానికుల సహాయంతో కాలవలో ఉన్న ట్రాక్టర్‌ను బయటకు తీశారు.