'ఉద్యమకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది'
RR: తెలంగాణ సాధనలో శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని మాటల్లో కొలవలేమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఎల్బీనగర్‌లో ఆమె మాట్లాడుతూ.. ఉద్యమకారులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అమరవీరులను తగిన విధంగా గౌరవించలేదని ఆరోపించారు.