VIDEO: ముక్తేశ్వరం తొగరపాయ వద్ద పారిశుద్ధ్య పనులు
కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం తొగరపాయ వద్ద మహాశివరాత్రి పురస్కరించుకుని పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ వారా జయ సావిత్రి పర్యవేక్షణలో బుధవారం స్నాన ఘట్టాలను పరిశుభ్రం చేయించి, ఇంజిన్ల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఈ ప్రాంతం చిన్న కాశీగా పేరొందింది అని, మహాశివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో స్నానమాచరిస్తారని నిర్వాహకులు తెలిపారు.