పాడి రైతులకు బోనస్ పంపిణీ

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ క్లస్టర్ పరిధిలోని కాకులపాడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో గురువారం రాత్రి 61 మంది పాడి రైతులకు ₹90,030 బోనస్‌ను ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పంపిణీ చేశారు. ఈ ఏడాది నాలుగు నెలల్లో రోజుకు 46 లీటర్ల పాలు పోసి గ్రామంలో ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు.