జల సాధన సమితి వ్యవస్థాపకుడిపై దాడి

జల సాధన సమితి వ్యవస్థాపకుడిపై దాడి

SRPT: మోతె మండలం రఘవాపురానికి చెందిన జల సాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణ పై గురువారం గొర్రెల కాపరులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో దుశ్చర్లకు తలకు బలమైన గాయమైంది. హుటాహుటిన స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుశ్చర్ల సత్యనారాయణ ప్రకృతి ప్రేమికుడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.