ఎమ్మార్పీఎస్ విజయోత్సవ సంబరాలు

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు గోపాల్ గారి దస్తగిరి ఆధ్వర్యంలో సోమవారం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆర్డినెస్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ర్యాలీ చేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.