సైకిల్‌పై పుణ్యక్షేత్రాలను చుట్టేస్తున్న 77ఏళ్ల వృద్ధుడు

ELR: 77ఏళ్ల వయసులో కూడా సైకిల్‌పై పుణ్యక్షేత్రాలను చుట్టేస్తున్నారు జిల్లాకు చెందిన మాజేటి శ్రీరామ్మూర్తి. స్థానిక కిరాణా షాప్‌లో గుమస్తాగా పనిచేస్తున్న ఆయన తన 28వ ఏటా సైకిల్‌పై ఒంటరిగా తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి నాసిక్, కాశీ, తిరుపతి, భద్రాచలం తదితర క్షేత్రాలను సందర్శించారు. మరో 3నెలల్లో అయోధ్య వెళ్లనున్నట్లు రామ్మూర్తి చెప్పారు.