KGBVని సందర్శించిన ఎమ్మెల్సీ

VZM: తుమ్మికాపల్లి (M) అడ్డూరివానిపాలెంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు సోమవారం సందర్శించారు. ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు సంభవించడంతో విద్యాలయంలో ఉన్న అన్ని గదులను పరిశీలించారు. విద్యార్థుల యోగ క్షేమాలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలపై ప్రిన్సిపాల్ విజయకుమారిని అడిగి తెలుసుకున్నారు.