'భూ సమస్యలను ఆర్డీవో పరిధిలోనే పరిష్కరిస్తారు'

PDPL: భూ భారతి పోర్టల్లోని కొన్ని మాడ్యూల్స్‌లో భూ సమస్యలను ఆర్డీవో పరిధిలోనే పరిష్కరిస్తారని కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున దరఖాస్తుదారులు అనవసరంగా కలెక్టరేట్‌కు వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సూచించారు. భూ భారతి చట్టంలోని కొన్ని మాడ్యూల్స్‌లో ఆర్డీవో స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.