ఉచిత శిక్షణ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల

ఉచిత శిక్షణ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల

ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ అర్హత పరీక్ష ఫలితాలను ఆదివారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఐదు నెలలపాటు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.