VIRAL: యాపిల్ కంటే చిన్న పసికందు
ముంబైలో 350 గ్రా. బరువుతో పుట్టిన చిన్నారి 124 రోజులపాటు NICUలో చికిత్స పొంది డిశ్చార్జ్ కావడం అద్భుతంగా నిలిచింది. జూన్ 30న ప్రీమెచ్యూర్‌గా (25 వారాల గర్భధారణ) జన్మించిన ఈ బిడ్డ యాపిల్ కంటే చిన్నగా ఉండేది. పుట్టిన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొంటూ డిశ్చార్జ్ అయింది. బిడ్డ బరువు 1.8 కిలోలకు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు బతికిన అత్యంత తక్కువ బరువున్న శిశువుగా నిలిచింది.