మద్యం మత్తులో కాలువలో పడి వ్యక్తి మృతి
MHBD: నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామానికి చెందిన శ్రీరాం నరేష్ (40) గత రెండు సంవత్సరాలుగా బతుకుదెరువు కోసం తొర్రూరు పట్టణానికి వచ్చి కూలీ పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన మద్యం మత్తులో ప్రమాదవశాత్తు తొర్రూరు పెద్ద చెరువు కాలువలో పడి మృతి చెందినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.