బాలుడు వైద్యానికి రూ.9 లక్షలు సీఎం సహాయ నిధి
AKP: పరవాడ మండలం వెన్నెల పాలెంకు చెందిన 8 నెలల వయస్సు గల వెన్నెల గన దక్షయ రుద్ర బోన్ మేరో వ్యాధితో బాధపడుతూ విశాఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి ఆరోగ్యం పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 9 లక్షలు మంజూరు చేయించారు.