మాజీ ప్రధానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
MBNR: మిడ్జిల్(M) కేంద్రంలో శుక్రవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి జడ్చర్ల మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేమని వారు తెలిపారు.