పేట్ బషీరాబాద్‌లో పసికందు మృతదేహం లభ్యం

HYD: పేట్ బషీరాబాద్ PS పరిధిలో గ్రీన్ పార్క్ కాలనీలో అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ఖాళీ ప్రదేశంలో వదిలి వెళ్లారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని శిశువును ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శిశువు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.