డిసెంబర్ 19 నుంచి బుక్ ఫెయిర్
AP: ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 19 నుంచి 29 వరకు పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రకటించింది. గతంలోని తప్పిదాలను, లోపాలను సరిదిద్దుకుని అందంగా, విజ్ఞానదాయకంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రదర్శనలో పాల్గొనేందుకు నవంబర్ 30వ తేదీ వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటామన్నారు.