'అంగన్‌వాడీ వర్కర్‌ల హామీలు అమలు చేయాలి'

నెల్లూరు రూరల్ పరిధిలోని వేదయపాలెం మన్సూర్ భవన్‌లో మంగళవారం జరిగిన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రూరల్ మహాసభల్లో, జిల్లా కార్యదర్శి షాహినా బేగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ వర్కర్‌లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వారి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో పలువురు అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు.