VIDEO: మహాకవి గురజాడ ఇల్లు ధ్వంసం

VIDEO: మహాకవి గురజాడ ఇల్లు ధ్వంసం

విజయనగరంలో దుండగులు రెచ్చిపోతున్నారు. ఏకంగా మహాకవి గురజాడ అప్పారావు నివాసంలో చొరబడి విధ్వంసం సృష్టించి తలుపు, లైట్లు ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది తెలుసుకున్న సాహితీవేత్తలు, కవులు మహాకవి స్మృతి స్థలానికే రక్షణ లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై పురావస్తు శాఖకు సమాచారం అందించారు.