తాటికుంట రిజర్వాయర్‌లో ఎమ్మెల్యే స్వయంగా పరిశీలన

GDWL: మల్దకల్ మండలం, తాటికుంట రిజర్వాయర్‌లో గల్లంతైన దుబ్బోనీ బావి రాముడి కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ టి. శ్రీనివాసరావు స్వయంగా బోటులో రిజర్వాయర్‌లోకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గజ ఈతగాళ్లతో యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.