నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద
నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1.19, ఔట్‌ఫ్లో 1.27 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 589.8 అడుగులు. మరోవైపు జూరాల ప్రాజెక్టు(TG)కు కూడా వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 30 వేలు, ఔట్‌ఫ్లో 46 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 318.1 అడుగులు.