జిల్లా మొదటి పంట ఏంటంటే..?
W.G: వేల ఏళ్ల క్రితం నుంచే గోదావరి నది పరివాహక ప్రాంతం అత్యంత సారవంతమైన భూమిగా ఉండేది. నది తెచ్చే ఒండ్రు మట్టి వరి సాగుకు అనుకూలమైనది. అందుకే దీనిని 'ఆంధ్ర అన్నపూర్ణ'గా పిలుస్తారు. క్రీ.పూ. నాటి బౌద్ధ ధాన్యకటక (అమరావతి), వేంగి (పెదవేగి) ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల్లో వరి గింజల అవశేషాలు లభించాయి. అంటే, శాతవాహనుల కాలం కంటే ముందు నుంచే ఇక్కడ వరి ప్రధాన పంటగా ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.