బొంబాయ్ బ్రిడ్జి: మాచర్లలో ఇంజినీరింగ్ చాతుర్యం

బొంబాయ్ బ్రిడ్జి: మాచర్లలో ఇంజినీరింగ్ చాతుర్యం

PLD: మాచర్ల వద్ద రోడ్డు పైన కాల్వ వెళ్లే అరుదైన అక్విడక్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నాగార్జునసాగర్ కుడి కాలువ నిర్మాణ సమయంలో చంద్రవంక వాగుతో పాటు రహదారి మార్గం అడ్డుగా మారింది. దీంతో నిర్మాణ బాధ్యతలు ముంబయి కంపెనీ చేపట్టి 3 ఏళ్లలో పూర్తి చేసింది. 180 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ అక్విడక్ట్‌ను స్థానికులు ‘బొంబాయ్ బ్రిడ్జి’గా పిలుస్తున్నారు.