ముమ్మరంగా వాహన తనిఖీలు
కృష్ణా: గుడివాడ బైపాస్ రోడ్డు గణేష్ అపార్ట్‌మెంట్ వద్ద ఎస్పై చంటిబాబు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో అనుమానాస్పద వాహనాలు, డాక్యుమెంట్స్ లేకుండా ప్రయాణించే వారి పై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.