ఉత్తమ సర్పంచ్‌గా ఖాదర్

ప్రకాశం: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా చంద్రశేఖరపురం మండలం కోయిలంపాడు సర్పంచ్ ఖాదర్ బుజ్జి ఉత్తమ సర్పంచ్‌గా ఎంపికయ్యారు. ఒంగోలులో గురువారం పర్యాటక ఛైర్మన్ నూకసాని బాలాజీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థాపక జాతీయ ప్రధాన కార్యదర్శి వీరభద్రాచారి మాట్లాడుతూ.. ఉత్తమ సర్పంచ్‌గా నాలుగోసారి అవార్డు అందుకోవటం అభినందనీయమన్నారు.