'తెలుగు భాష అభివృద్ధికి కృష్ణారావు కృషి'

కృష్ణా: తెలుగు భాష అభివృద్ధికి మండలి వెంకట కృష్ణారావు కృషి చేశారని టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు అన్నారు. మంగళవారం నాగాయలంకలో ఉమ్మడి రాష్ట్ర మాజీమంత్రి కృష్ణారావు శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కృష్ణారావు విగ్రహానికి చిట్టిబాబు పూలమాలవేసి నివాళులర్పించారు. కృష్ణారావు సేవలు స్మరించుకున్నారు. తలశిల స్వర్ణలత, బండ్రెడ్డి చినబాబు పాల్గొన్నారు.