మాతృ మరణాలు తగ్గించాలంటూ కలెక్టర్ ఆదేశాలు
NRPT: జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా పరిధిలో నమోదైన మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆమె, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి కేసును జాగ్రత్తగా పరిశీలించి నివేదికలు సమర్పించాలన్నారు.