VIDEO: పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరిన వాహనదారులు
NRML: భైంసా పట్టణంలో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఇవాళ రిలయన్స్ పెట్రోల్ బంకులో మాత్రమే ఉందన్న విషయం తెలుసుకున్న వాహనదారులు బంక్ వద్ద బారులు తీరారు. బంక్ నుంచి సుమారు 300 మీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి.