VIDEO: 'వైభవంగా బసవన్నల ఊరేగింపు కార్యక్రమం'

ADB: తాంసి మండల కేంద్రంలో శుక్రవారం పోలాల అమావాస్య పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని బసవన్నలను అందంగా ముస్తాబు చేసి సమీపంలోని ఆలయాల చుట్టూ ప్రదక్షణ చేయించారు. ఆ తర్వాత ఇంటికి తీసుకువచ్చిన బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. బసవన్నల ఊరేగింపుతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.