నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

గుంటూరు నగరంలో రహదారి విస్తరణ, చెట్టు కొమ్మల తొలగింపు నేపథ్యంలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. గురవయ్య తెలిపారు. శ్యామలానగర్, బ్రాడీపేట‌, లక్ష్మీపురం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.