VIDEO: ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
కృష్ణా: గుడివాడ టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కుల వివక్షతకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.