గంజాయి ముఠాకు పదేళ్లు జైలు, లక్ష జరిమానా
ATP: గంజాయి సరఫరా, విక్రయాలకు పాల్పడిన ఐదుగురు నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సత్యవాణి సంచలన తీర్పు ఇచ్చారు. 2020లో దాడులు చేసి 52.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న కేసులో ఈ శిక్ష పడింది. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులను SP జగదీష్ అభినందించారు.