MHBD: దొంగతనానికి యత్నించిన వ్యక్తికి దేహశుద్ధి
MHBD: మరిపెడ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో దొంగతనానికి యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మార్కెట్‌లో ఓ వ్యక్తి వద్ద నుంచి దొంగ మొబైల్ ఫోన్‌తో పాటు నగదును దొంగిలించే ప్రయత్నం చేశాడు. దొంగ ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, దేహశుద్ధి చేశారు.