మంగళపల్లి సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక

మంగళపల్లి సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక

KNR: చొప్పదండి మండలం మంగళపల్లి సర్పంచ్ పెద్దెల్లి శారద సురేష్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అర్హులకు అందించాలని, అభివృద్ధి విషయంలో అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.