కిసాన్ పరివార్ ఆధ్వర్యంలో పశువులకు టీకాలు

MHBD: కిసాన్ పరివార్ లిమిటెడ్ పశు వైద్య బృందం ఆధ్వర్యంలో ఆదివారం కురవి మండలంలోని పలు గ్రామాల పశువులకు టీకాలను వేశారు. మండలంలోని నేరడ, చీమల తండా, మోదుగుల గూడెం, బజ్జూరు తండాలలో గల దాదాపు వెయ్యికి పైగా గొర్రెలు,మేకలు, ఆవులు, ఎద్దులకు టీకాలను వేశారు. ఈ కార్యక్రమంలో డా.అలీప్రకాశ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.