జగన్కు సవాల్ విసిరిన సోమిరెడ్డి

AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించారు. ఉర్సా సంస్థకు ఎకరా రూపాయికి ఇచ్చినట్లు రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రుజువు చేయలేకపోతే జగన్ రాజీనామా సిద్ధమా అని ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో వాస్తవాలు చూసి జగన్ ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.