సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA

గుంటూరు రైలుపేట 1వ లైన్ వద్ద సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో కొత్త సీసీ రోడ్ నిర్మాణానికి తూర్పు ఎమ్మెల్యే నసీర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వారి కష్టాలు తగ్గుతాయి. ఇది ప్రాంతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.