భారత్ మాల హరహదారిపై అండర్ పాస్ను ఏర్పాటుకు విన్నపాలు

భారత్ మాల హరహదారిపై అండర్ పాస్ను ఏర్పాటుకు విన్నపాలు

శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని తూముకుంట, పర్దీపూర్, ఉప్పల, జడ దొడ్డి, గుడి దొడ్డి గ్రామాల రైతులు తహసీల్దార్ షాహిదా బేగంకు భారత్ మాల రహదారిపై అండర్ పాస్‌ను ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన ఆమె నేరుగా భారత్ మాల రహదారి నిర్మిస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపి.. ఆ ప్రాంతంలో అండర్ పాస్ అవసరమని ఆమె తెలిపారు.