నేడు జడ్పీ కార్యాలయంలో 'మీ కోసం' కార్యక్రమం

నేడు జడ్పీ కార్యాలయంలో 'మీ కోసం' కార్యక్రమం

SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం 'ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక, మీ కోసం' కార్యక్రమం నిర్వహించబడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.