చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

ELR: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి ఎర్ర కాలువ జలాశయంలో మంగళవారం చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్థానిక నగేరి వెంకటేశ్వరరావు వృత్తిరీత్యా చేపల వేట సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వల ఒంటికి చిక్కుకోవడంతో దాన్ని లాగే ప్రయత్నంలో ఎర్రకాలువలో పడి మృతి చెందాడు.