'96 వేల మంది పీపీపీకి వ్యతిరేకంగా సంతకాలు చేశారు'
NTR: అక్టోబర్ నెల నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో సంతకాల సేకరణ చేపట్టామని చెప్పారు. ఇప్పటికే 96 వేల మంది ప్రజలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారని వెల్లడించారు.