ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తోన్న చలి

ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తోన్న చలి

ASR: పాడేరు ఏజెన్సీ ప్రాంతాన్ని చలి వణికిస్తోంది. ఉదయం వేళ దట్టంగా పొగమంచు అలుముకోవడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. అరకు, మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు లైట్ల వెలుతురులో ప్రయాణం సాగిస్తున్నారు. స్థానికులు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.